మనవార్తలు, శేరిలింగంపల్లి :
ఉన్నత విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టెక్ఎగ్జాట్, పర్ ఫెక్ట్ స్కిల్స్ సంస్థలు ప్రత్యేక శిక్షణ నిస్తున్నట్లు పర్ ఫెక్ట్ స్కిల్స్ డైరెక్టర్ అమిత్ కుమార్ మిశ్రా తెలిపారు. ఇందులో భాగంగా శనివారం రోజు కొండాపూర్ లోని వైట్ ఫీల్డ్ లోని వర్క్ పెల్లాలోని సంస్థ ఆవరణలో నిర్వహించిన వాక్ ఇన్ కు సుమారు 4 వేల మంది నిరుద్యోగులు హాజరైనట్లు తెలిపారు. ఈ యేడాది 3 వేల మంది కొత్తవారిని, 2 వందల మంది అనుభవజ్ఞులైన వారిని ఎంపిక చేసి వారికి ఉచిత శిక్షణతో పాటు 15 వేల రూపాయల స్టైఫండ్ ను అందించనున్నట్లు పేర్కొన్నారు. నూతన టెక్నాలజీ పై విద్యార్థులకు శిక్షణనివ్వడంతో పాటు వారిని గ్లోబల్ ఐటి సేవల సంస్థల్లో విధులు నిర్వహించేలా తర్ఫీదునిచ్చి రాణించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి మాజీ మైక్రోసాఫ్ట్ బృందంచే శిక్షణనిప్పిస్తామని, ప్రతీ సంవత్సరం నిరద్యోగుల ఎంపిక ప్రక్రియ కోనసాగుతుందని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…