పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని విశ్వ భారతి లా కళాశాల కరస్పాండెంట్ రవి అనంత అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ను తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి విశ్వ భారతి లా కళాశాలలో నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కరస్పాండెంట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. భవాని ని, అదేవిధంగా అధ్యాపకుల బృందాన్ని సన్మానించి, బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా రవి అనంత మాట్లాడుతూ… ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్న స్థానం విలువ ఎంతో గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల అధ్యాపకులు రమ్యశ్రీ, కీర్తి, తేజ గురుమూర్తి, తేజశ్రీ, యాష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.