పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో మంగళవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా, కృష్ణ తజ్ఞతాపూర్వకంగా నిర్వహించారు. యువతను సన్మార్గంలో నడుపుతూ, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేలా. అంకితభావంతో పనిచేస్తున్న విద్యావేత్తలను ఈ సందర్భంగా సత్కరించారు. గౌరవప్రదమైన అధ్యాపకులకు స్పా దయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు.మనదేశంలో ప్రతియేటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఇది ప్రఖ్యాత తత్వవేత్త, పండితుడు, భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని సూచిస్తుంది. విద్యార్థుల జీవితాలతో ఉపాధ్యాయులు చేసిన అమూల్యమైన సేవలను ఈరోజున స్మరించుకోవడం పరిపాటిగా మారింది.గీతం హెదరాబాద్ అధ్యాపకులకు కలకాలం గుర్తుండిపోయేలా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి, వారి సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనల ద్వారా వారి ప్రతిభను ప్రదర్శించారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్న అధ్యాపకులకు గీతం, హెదరాబాద్ అధనపు ధపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల అంకితభావం, ఆభిరుచి, అచంచలమైన నిబద్ధత మనందరికీ స్పూర్తినిస్తాయని, ఈ కార్యక్రమ నిర్వహణలో వారి అమూల్యమైనసహకారం గర్వించదగినదని అన్నారు.
గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్, స్వాగత వచనాలతో అరంభమైన ఈ వేడుకలలో అధ్యాసకులు, విద్యార్థులు కలిసి మధుర క్షణాలను పెంచుకున్నారు. తేనీటి నిందుతో ఈ వేడుకలు ముగినాయి.