సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం
25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం..
ఎడ్యుకేషనల్ హబ్ గా పటాన్‌చెరు
భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులది
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు
100 మంది ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని, భావి భారత పౌరులను తయారు చేయాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా గురు పూజోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆయన అభినందిచారు పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రభుత్వ పాఠశాల గురుపూజోత్సవ వేడుకలకు ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ తన తండ్రి ఒక ఉపాధ్యాయుడని సమాజంలో ఒక విద్యార్థి పౌరుడుగా ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు ఉత్తమ భవిష్యత్తును అందిస్తారని అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులను ఉత్తమ బోధన చేస్తున్న ఉపాధ్యాయులను సన్మానించడం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ ను ప్రశంసించారు.ప్రస్తుత సమాజంలో మత్తు పదార్థాల వినియోగం ఒక జటిల సమస్యగా మారిందని అన్నారు. పాఠశాల స్థాయి నుండి మత్తుమదార్థాలు వాడకం వల్ల కలిగే అనార్థాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు.పటాన్‌చెరు నియోజకవర్గంలో ప్రతి నెల సైబర్ క్రైమ్ లు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల ఓటీపీలు, డిజిటల్ అరెస్టులు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాలు లక్షల రూపాయలు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఎవరైనా ఇలాంటి పేర్లతో ఫోన్లు చేస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మినీ ఇండియాగా పేరుందిన పటాన్‌చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక శాతం పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యను అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు.ఈ విద్యా సంవత్సరం నుండి పటాన్‌చెరులో పాలిటెక్నిక్ కళాశాల తరగతుల సైతం ప్రారంభించడం జరిగిందని తెలిపారు.కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల భవనాలు తీర్చిదిద్దుతూ మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య మూలంగా అడ్మిషన్లు సైతం దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
గత 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా గురుపూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి, ఉత్తమ గురువులను సన్మానించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు నైతిక విలువలు బోధించాలని, క్రీడల పై ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, రెసిడెన్షియల్ కళాశాలలో, మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి బడుగు బలహీన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని అన్నారు.అనంతరం పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ నేతృతంలో ప్రతి సంవత్సరం గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు 5000 రూపాయలు చొప్పున నగదు పారితోషకాన్ని అందించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్, రామచంద్రాపురం కార్పోరేటర్ పుష్ప నగర్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీలు దేవానందం, యాదగిరి యాదవ్, మాజీ జెడ్పిటిసి లు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్,, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సీఐలు వినాయక రెడ్డి, లాలూ నాయక్, ఎంఈఓ లు పీపీ రాథోడ్, నాగేశ్వరరావు నాయక్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…