_ముఖ్య అతిథిగా హాజరెనై ఎన్ఎండీసీ జీఎం చౌరాసియా
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) విభాగం ఆధ్వర్యంలోవోటీ అప్లికేషన్లలో వీఎల్ఎస్ఐ కోసం అవకాశాలు, ‘సంనేళ్లుఅంశంపై నిర్వహిస్తున్న ఆరు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్ఎపీ)ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)లోని శిక్షణ, లెర్నింగ్ (ఏటీఏఎల్) అకాడమీ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) జనరల్ మేనేజర్ (పరిశోధన-అభివృద్ధి) ఎస్.కె.చౌరిసాయా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విద్యార్థులకు ఫలవంతమైన విద్యను అందించడంలో పరిజ్ఞానం ఉన్న అధ్యాపకుల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన నొక్కిచెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే ఎన్ఎండీసీ పర్యావరణ అనుకూల మెన్డింగ్ పద్ధతులకు కట్టుబడి ఉందన్నారు. గత ఏడాది 42 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన తమ సంస్థ 2030 నాటికి 300 మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పారు. ఆస్ట్రేలియాలోని లెగసీ గోల్డ్ మెన్ట్స్ కలిసి బంగారు ఖనిజం వెలికితీతతో పాటు మధ్యప్రదేశ్లోని పన్నాలోని పూర్తి యాంత్రికశక్తితో తవ్వే వజ్రాల గనిని కూడా ప్రారంభించినట్టు చెప్పారు. ఖనిజాల వెలికితీతలో పర్యావరణ సుస్థిరత ప్రాముఖ్యత, ఐవోటీ, కృత్రిమ మేథ వంటి స్మార్ట్ టెక్నాలజీల అవసరం, తక్కువ ప్రయత్నంతో గరిష్ట. ఉత్పత్తి సాధించవలసిన అవసరాలను చౌరాసియా వివరించారు.గీతం కోర్-ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి, గీతం-ఎన్ఎండీసీల మధ్య సహకారాన్ని అభిలషించడంతో పాటు ఈ ఎఫ్ఎపీ ఒక ప్రధాన జాతీయ సదస్సుగా పరిణామం చెందుతుందని ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి పరిశ్రమలో వీఎల్ఎస్ఐ, ఐవోటీలకు ఉన్న డిమాండ్, ఈ ఐదురోజుల ఎఫ్ఎపీ నుంచి ఇందులో పాల్గొనేవారు పొందే ప్రయోజనాలను వివరించారు.లవ్లీ ప్రొఫెషన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సుమన్ లతా త్రిలిలీస్ఐ ఇన్ ఐవోటీనే అంశంపె గీతం మానస్తత్వశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ దుర్గేష్ సుమదివీరుపాలన, ఒత్తిని అధిగమించునే అంశంపై ప్రసంగించారు. ఈ ఎఫ్ఎపీ ద్వారా సాంకేతిక పురోగతికి గల అవకాశాల గురించి కార్యక్రమ సమన్వయకర్త ప్రొఫెసర్ కె.మంజునాథాచారి వివరించారు. నవంబర్ 25 (శనివారం) వరకు ఈ ఎఫ్ఎపీ కొనసాగుతుందని ఆయన తెలిపారు.