politics

పదోతరగతి ఫలితాల్లో త్రివేణి విద్యార్థుల ప్రతిభ

మనవార్తలు, శేరిలింగంపల్లి :

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం రోజు విడుదలైన ఎస్‌ఎస్‌సి ఫలితాలలో ఎప్పటిలాగే మియాపూర్‌ బ్రాంచ్‌ త్రివేణి విద్యార్థులు తమ సత్తా చూపారు. టాప్‌ గ్రేడులను సాధించి తమ ప్రతిభను చాటారు. తెలంగాణలో టెన్త్ ఫలితాల్లో త్రివేణి పాఠశాల సంచలన రికార్డును సాధించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదవతరగతి ఫలితాల్లో త్రివేణి విద్యార్థులు విజయదుందిభి మ్రోగించారు. ఈ సందర్భంగా త్రివేణి విద్యాసంస్థల డైరక్టర్‌ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి పత్రికలకు ఓ ప్రకటనను విడుదల చేశారు. మియాపూర్‌ బ్రాంచీలో గల తమ విద్యార్థులు ఎస్‌ఎస్‌సి గ్రేడుల్లో 13 మంది జిపిఏ 10/10కి పాయింట్లు సాధించారని తెలిపారు. ఇది గతం కంటే ఘనంగా సాధించామని అన్నారు.

అలాగే 27 మంది 9.7కి పైగా పాయింట్లను, 9.0కి పైగా పాయింట్లు 60 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. ఇక మొత్తం ఏ గ్రేడులను 60 మంది విద్యార్థులు సాధించారని, అలాగే మ్యాథ్స్‌లో ఏ గ్రేడులను 67 మంది విద్యార్థులు, సైన్స్‌లో ఏ గ్రేడులను 41 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఇన్ని విజయాలకు కారణం మారే తరానికి, మారే విద్యావిధానాలకు అనుగుణంగానూ, నేటి పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యాప్రణాళికలను రూపొందించి తదనుగుణంగా విద్యనందిస్తున్నామని పేర్కొన్నారు.అలాగే తమ విద్యాసంస్థలో అనుభవం, అంకితభావం గల బోధనా సిబ్బంది ఉండటం వలన ఈ సంచలన విజయాలు సాధించడం సాధ్యమైందని పేర్కొన్నారు. టాప్‌గ్రేడ్‌ల సాధనకే పరిమితంకాక, జాతీయస్థాయి పోటీ పరీక్షలైన ఐఐటి, నీట్, జె ఎస్ ఓ, ఎన్ టి ఎస్ ఈ, ఒలంపియాడ్ వంటి రేపటి పోటీపరీక్షల్లో కూడా విజయం సాధించేలా పటిష్టమైన పునాదిని ఏర్పరుస్తుందని, వారి ఉజ్వల భవితకు నిరంతరం కృషిచేస్తుందిని తెలిపారు.

ఈ విజయాలే నిదర్శనమని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలలో 24 స్టేట్‌ ర్యాంకులను సాధించిన ఘనత తమకే సొంతమని, అలాగే సౌత్‌ ఇండియా సైన్స్‌ ఫెయిర్‌, జిల్లాస్థాయి సైన్స్‌ ఫెయిర్‌లలో వరుసగా మూడు సార్లు బెస్ట్‌ స్కూల్‌ అవార్డును, రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలలో ఆరుసార్లు ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచినట్లు తెలిపారు. ఈ విజయాలు హైదరాబాద్‌, ఖమ్మం మరియు కొత్తగూడెంలలో గల తమ బ్రాంచీలనుండి సాధించామని ఈ సందర్భంగా టెన్త్‌లో విజయం సాధించిన విద్యార్థులకు, ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, బోధన, బోధనేతర సిబ్బందికి తమ శుభాభినందనలను తెలిపారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

3 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

3 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

3 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

3 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

3 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago