Telangana

ప్రతిభకు లింగభేదం లేదు: ఉపాసన కామినేని

_జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభమైన గీతం వార్షిక విద్యార్థి ఉత్సవం ‘ప్రమాణ’

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

‘ప్రతిభ గొప్పగా మాట్లాడుతుంది. అది బాహ్యమైన వాటి కంటే చాలా ముఖ్యమైనది. ఒక మహిళగా నేను నా సామర్థ్యాలతో శక్తివంతంగా భావిస్తున్నాను’ అని అపోలో ఆస్పత్రుల సామాజిక సేవ (సీఎస్ఆర్) ఉపాధ్యక్షురాలు ఉపాసన కామినేని కొణిదెల అన్నారు.హైద‌రాబాద్. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రతిఏటా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక, సాంస్కృతిక (టెక్నో, కల్చరల్ ఫెస్ట్) పండుగను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఆడ, మగ అనే లింగ భేదం లేకుండా, విశేషమైన విజయాల కోసం కృషిచేయాలని, తమ అత్యుత్తమ ప్రదర్శనకు తమను తాము సన్నద్ధం చేసుకోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు.

ఈ ప్రారంభోత్సవంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ గడ్డం వంశీకృష్ణ తన స్వీయ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. వ్యక్తులకు అందుబాటులో ఉన్న అపరిమితమైన అవకాశాలను ఎత్తిచూపారు. హద్దులను అధిగమించి ఆయా వ్యక్తుల అభిరుచులు, ఆసక్తులను అనుగుణంగా జీవితంలో రాణించాలని హితవు పలికారు. ఎలక్ట్రికల్, మేనేజ్ మెంట్ నేపథ్యం ఉన్న తాను సౌరశక్తి రంగంలో ఉన్న అభిరుచితో సౌర పైక‌ప్పును రూపొందించి, మేథో హక్కు (పేటెంట్) పొందానని, అలాగే ఎలక్ట్రికల్ వాహనాల రంగంలో ఉన్న ఆసక్తిమేరకు ఓ ఎలక్ట్రికల్ బెక్ ను రూపొందించి మనదేశంలో ఆరు పేటెంట్లు పొందినట్టు చెప్పారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి, ప్రమాణ- 2024 అధ్యాపక సలహాదారు ప్రొఫెసర్ పి.త్రినాథరావు, స్టూడెంట్ లైఫ్ అధికారులు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమూనా ఐక్యరాజ్య సమితి శిక్షణ కార్యశాల, ఆర్కిటెక్చర్ నమూనాల ప్రదర్శన, బ్యాండ్ల పోటీ, ట్రెజర్ హంట్, సంగీతం, నృత్య ప్రదర్శనలతో సహా అనేక ఆకర్షణీయమైన కార్యక్రమాలతో గీతం విద్యార్థులు ప్రమాణ ఫెస్ట్ కు వ‌న్నెల‌ద్దారు. ఈ పండుగతో పాటు సంప్రదాయ వస్త్రధారణ దినోత్సవాన్ని కూడా విద్యార్థులు నిర్వహించారు. సీతాకోక చిలుకల్లా కలియ తిరుగుతున్న విద్యార్థులతో గీతం ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది. ప్రమాణ-2024 అన్ని హద్దుల దాటిన ప్రతిభా స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, సృజనాత్మకత, ఆవిష్కరణ, కలుపుకుపోయే వేడుకగా కొనసాగుతోంది.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

10 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago