గీతం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు డబ్బింగ్ కళాకారుడు రాజు పిలుపు
గీతమ్ లో ఘనంగా ‘ఎన్ఎస్ఎస్ డే’
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జాతీయ సేవా పథకం. (ఎన్ఎస్ఎస్) వాలంటీర్లు శాస్త్రీయ దృక్పథంతో చేపట్టి, నిబద్ధతతో చురుకుగా పాల్గొనాలని ఐదు నంది అవార్డుల గ్రహీత, ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు ఆర్.సీ.ఎం. రాజు పిలుపునిచ్చారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని జాతీయ సేవా పథకం మంగళవారం నిర్వహించిన ‘ఎన్ఎఎస్.ఎస్ దినోత్సవం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను లాంఛనంగా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, తన కళాశాల రోజులు, ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ లో తన అనుభవనాలను గుర్తుచేసుకున్నారు. వాలంటీర్లను సమాజంలో ప్రత్యేకమైన వ్యక్తులుగా ఎన్ఎస్ఎస్ నిలబెడుతుందని చెబుతూ, సమాజ సేవ ప్రాముఖ్యతను వివరించారు. తాను డబ్బింగ్ చెప్పిన కల్కి తంగళన్ వంటి సలు సినిమాలలోని డైలాగ్ లను చెప్పి విద్యార్థులను ఉత్సాహపరిచారు. పునర్వినియోగించ దగ్గ వస్తువులను ఎంచుకోవడం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ‘శుభ్రత నాగరికతకు చిహ్నమంటూ, దానిని మనమంతా పాటిద్దామనే ప్రతినబూనాలని రాజు ఉద్బోధించారు.
గీతం ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ అధికారికంగా వేడుకలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా, అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మాట్లాడుతూ, ఇతర విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండేలా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మసలుకోవాలని, సశ్చీలత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణం, నిస్వార్థతలు తమ పని విధానంలో ప్రతిబింబించాలని సూచించారు. గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ, ఎటువంటి. పరిస్థితులు, ఏ సమయం అనేది చూడకుండా, సమాజ సేవలో ఎల్లవేళలా గీతం ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు. ముందుంటారంటూ, సాధారణ ఎన్నికలలో వెబ్ క్యాస్టింగ్ వంటి కొన్ని సేవా కార్యక్రమాలను ఆయన గుర్తుచేశారు.ఎన్ఎఎస్ ఎస్ గీతాలాపనతో అరంభమైన కార్యక్రమం, కార్యక్రమ సమన్వయకర్త భార్గని వందన సమర్పణతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో ముగిసింది. వాలంటీర్లలో సేవా స్ఫూర్తిని, వారి వ్యక్తిగత ఎదుగుదలను పెంపొందిస్తూ ఈ వేడుక విజయవంతమైంది.