గ్రామీణ ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలు పని తీరును పరిశీలించి న కేంద్ర బృందం

చిట్కుల్: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తెలంగాణ లో పర్యటించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు పరిశీలనకు తమిళనాడు యూనివర్సిటీ ప్రొఫెసర్ బృందం పర్యటించింది. చిట్కుల్ గ్రామంలో లో కేంద్రప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయని కమిటీ బృందం సభ్యులు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని అభివృద్ధి, కేంద్ర నిధులు ఎలా అందుతున్నాయని, […]

Continue Reading

వీరబద్రియ కుల సంఘం నూతన కమిటీ ఎన్నిక…

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన హక్కులను సాధించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర వీరబద్రియ కుల సంఘం రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వీరబద్రీయ కుల సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు . నూతన సంఘం సభ్యులకు రాష్ట్ర కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ సమక్షంలో అనుబంధ పత్రం ఇచ్చారు. రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కక్ష సాధింపు

అమీన్ పూర్ అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో బుధవారం చేపట్టిన కూల్చివేతలో అధికారులు అతి ఉత్సాహం చూపారని కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ ఆరోపించారు. గురువారం అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల పేరిట ఆర్డీవో నగేష్ ఆధ్వర్యంలో చేపట్టిన కూల్చివేతలో అధికారులు పక్షపాతం చూపారని తెలిపారు. అయినా వాళ్లకు ఒక న్యాయం ఎదుటి వారికి ఒక న్యాయమా అని […]

Continue Reading

బిసి బంద్ తోనే బీసీల అభివృద్ధి – భేరి రాంచందర్ యాదవ్…….

శేరిలింగంపల్లి: బిసి బంద్ పేరుతో ప్రతీ కుటుంబానికి పది లక్షలు ఇస్తేనే బిసిల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ అన్నారు. మంగళవారం రోజు శేరిలింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో బిసి బంద్ ప్రకటించాలని కోరుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్, సంగారెడ్డి జిలా యూత్ విభాగం అధ్యక్షుడు గణేష్ యాదవ్, వనపర్తి ఉప సర్పంచ్ ఈ. లక్ష్మణ్ యాదవ్, చందు యాదవ్ లతో కల్సి డిప్యూటీ ఎలక్షన్ అధికారి మణిపాల్ […]

Continue Reading

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దళిత వ్యతిరేకి – పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దళిత వ్యతిరేకి అని, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత నెల 29వ తేదీన అమీన్ పూర్ మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా సుల్తాన్ పూర్ ఎంపీటీసీ మధురవేణి దేవదానం గ్రామ సమస్యల పరిష్కారం కొరకు స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వబోగా, ఎమ్మెల్యే ఆ వినతి […]

Continue Reading

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం – బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత

పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సమావేశానికి బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుధవారం పటాన్ చెరు మండలం ముత్తంగి బీజేపీ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మధురి ఆనంద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ సమావేశానికి వచ్చిన మహిళలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు.   జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ […]

Continue Reading

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు…

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు … – జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ పటాన్ చెరు: అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ హెచ్చరించారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో మూడవరోజు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను డీఎల్పీఓ సతీష్ రెడ్డి, ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ ల తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి […]

Continue Reading

సంచరిస్తున్న ఎలుగుబంటి….

 సంచరిస్తున్న ఎలుగుబంటి…. సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా… పుల్కల్ మండలం ఇసోజిపేట బొమ్మారెడ్డి గూడెం గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. ఎలుగుబంటి సంచారంతో రైతులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని ఫారెస్ట్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకొని తమకు రక్షణ కల్పించాలని రైతులు విన్నవిస్తున్నారు.

Continue Reading