సమాచార హక్కు చట్టం సాధన కమిటీ గా సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ మాజీద్ అలీ

politics Telangana

-రాష్ట్రస్థాయి సమాచార హక్కు చట్టం సాధన కమిటీ అవగాహన సదస్సు రవీంద్ర భారతిలో నిర్వాహణ

-ప్రజల్లో చైతన్యం పెంచేందుకు మీడియా ఎన్జీవోల పాత్ర కీలకం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) సామాన్యుడికి కొండంత ధైర్యమని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ మాజీద్ అలీ అన్నారు. హైదరాబాదులోని రవీంద్ర భారతి లో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్,రాష్ట్ర అధ్యక్షులు సూర్య స్రవంతి చేతుల మీదుగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి నియామక పత్రాన్ని అందించారు. అనంతరం మాజీద్ అలీ మాట్లాడుతూ  పారదర్శకమైన పాలనకు ఆర్టిఐ ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వ పాలనలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదని తెలిపారు. సమాచార హక్కు చట్టం మాత్రమే కాదు- పాలనలో పౌరులు భాగస్వామ్యం కావడం అని అభిప్రాయపడ్డారు. ఈ చట్టాన్ని వ్యక్తిగత అవసరాలకు కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని అన్నారు.2005లో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిందని,దీనితో పాలనలో పారదర్శకత పెరిగిందని చెప్పారు. జవాబుదారీతనం పారదర్శకంగా పనిచేసేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు కోరే సమాచారాన్ని అందించడంలో పీఐవో, ఏపీఐవో ల బాధ్యత కలిగి ఉండాలన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు కోరిన సమాచారం అందించాలని సూచించారు. సమాచార హక్కు చట్టం 2005 లోని అంశాలు, ఆర్టిఐ దరఖాస్తు విధానం, దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తు ఫీజు, ఇవ్వాల్సిన సమాచారం, పీఐవో, ఏపీఐవో ల బాధ్యతలు తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు సూర్య స్రవంతి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేష్ గౌడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ కొంగటి రాజ్ కుమార్, సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *