మనవార్తలు ,రామచంద్రపురం
స్వామివివేకానందా యువతకు అత్యంత స్ఫూర్తిదాయకం అని రాష్ట్ర బిజెపి మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురం పట్టణంలో బిజెపి పట్టణ శాఖ అధ్యరంలో నిర్వహించిన 159 స్వామి వివేకానంద జయంతి వేడుకల్లోని పురస్కరించుకొని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ వివేకానంద యువతకు స్పూర్తి ప్రదాత, మార్గదర్శి అని భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన వ్యక్తి అని చికాగో ప్రసంగం తరువాత హిందుమతం యొక్క ఖ్యాతిని విస్వవ్యాప్తమ్ చేసి, తన బోధనల ద్వారా ఎంతో మంది యవతకు అధర్శంగా నిలిచారని భారతదేశం గొప్పతనాన్ని చాటిచెప్పిన మహనీయుడు వివేకానందుడు అని రాష్ట్ర బిజెపి మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సరస్వతి,రవీందర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి పద్మావతి, పట్టణ మహిళా అధ్యక్షురాలు పూర్ణిమ, ఓబీసీ మోచ అధ్యక్షులు యాదగిరి, రవికుమార్, రవీందర్ గౌడ్,మల్లేష్,రమేశ్ గుప్తా,బసమ్మ, బిజెయైయం నాయకులు ప్రవీణ్, బిజెపి నాయకులు బలరామ్, వెంకటేశ్, రవీంద్ర నాయక్, పాల మల్లేష్, నరసిహ్మా, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
