చిరుధాన్యాల ద్వారా స్థిరమైన పోషణ, ఆరోగ్యం గీతం కార్యశాలలో వక్తలు

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

చిరుధాన్యాలు (మిల్లెట్లు), నిర్లక్ష్యానికి గురై ఇప్పటివరకు ఉపయోగించని ఇతర జాతుల వినియోగం ద్వారా స్థిరమైన పోషణ, ఆరోగ్యాన్ని ప్రోత్సహించవచ్చని వక్తలు అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘వ్యవసాయ-ఆహార పర్యావరణ వ్యవస్థలో చిరుధాన్యాలు, తినదగిన అడవి జాతులను ప్రధాన స్రవంతిలోకి తేవడం’ అనే అంశంపై సోనువారం కార్యశాల నిర్వహించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ హెల్త్ అండ్ ఇన్నోవేషన్ (సీహెచ్ఎడబ్ల్యూఐ), బ్రిటన్ లోని, కోవెంట్రీ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ అగ్రోకాలజీ, వాటర్ అండ్ రెసిలెన్స్ సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ కార్యశాలలో సలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన, స్థిరమైన ఆహార భద్రత, పోషకాహారంలో ఆవిష్కరణ కోసం ప్రతిపాదనలను చర్చించి అభివృద్ధి చేయడం, ముఖ్యంగా చిరుధాన్యాలు, ఇతర వినియోగించని ఆహారాలపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వాటి వినియోగానికి సంబంధించిన సవాళ్లన్ని చర్చించారు. తొలుత, ఫుడ్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.ఉమాదేవి, క్యాంపస్ లెఫ్ట్ డీన్ ప్రొఫెసర్ బాల్కుమార్: గురునాథ్ మార్తీ గీతమ్ లోని సెంటర్ ఫర్ హెల్త్ అండ్ ఇన్నోవేషన్ గురించి ఇతర వక్తలకు పరిచయం చేసి, దాని భవిష్య ప్రణాళికలను వివరించారు.

కోవెంట్రీ వర్సిటీకి చెందిన డాక్టర్ లోపాముద్ర పట్నాయక్ సక్సేనా, ప్రొఫెసర్ న్యూ చార్లెస్ వర్త్ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ కి చెందిన డాక్టర్ పి.ఎం. మాలతి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఆహారం, పోషకాహార విభాగానికి చెందిన ప్రొఫెసర్ టీ.ఎం. హిమవతి, ఒడిస్సా మిల్లెట్ మిషన్ కు . చెందిన దినేష్ బాలం, వాసన్ కు చెందిన జయప్రకాష్, రిచ్ నుంచి డాక్టర్ జోనాథన్ ఫిలాయ్, మిల్లెనోవా ఫుడ్స్. వ్యవస్థాపకురాలు సౌమ్య ముందారపు తదితరులు పోషకాహార సమస్యలను పరిష్కరించడానికి తమ పరిశోధన సహకారం అందించడంతో పాటు చిరుధాన్యాల సేద్యంపై వ్రాతావరణ మార్పుల ప్రభావాన్ని వివరించారు.ఈ కార్యశాలను డాక్టర్ జి.నిహారిక, డాక్టర్ శృతి పావగాడి, శ్వేత గండికోటి విజయవంతంగా నిర్వహించారు. ఆహారం, సాంకేతికత రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ కట్టుబడి ఉందన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *