మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి మండలలోని మాదాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలంగాణ రైజింగ్ ఉచిత వేసవి శిక్షణా శిబిరo 2025 పేరుతో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు స్కూల్ ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు తెలిపాడు. ఈ కార్యక్రమంలో యోగా, ధ్యానం, పాటలు, ఆటలు, కర్ర సాము, చిత్రలేఖనం రీడింగ్ బుక్స్, వ్యక్తిత్వ వికాసము, ఆరోగ్యపు అలవాట్లు, చేతి వ్రాత, గణితంలో మెళకువలు, స్వయంగా మాట్లాడడం, నృత్యం,టి ఎల్ ఎం తయారీ, ప్రాజెక్టులు వంటివి పిల్లలకు నేర్పించడం జరుగుతుందనీ తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందనీ. పిల్లలకు స్నాక్స్ అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి మండల విద్యాధికారి వెంకటయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధారాణి, లీలాదేవి, బాలా మణి, లక్ష్మీదేవి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *