ప్రయోగాధార పరిశోధనపై గీతమ్ లో వేసవి పాఠశాల

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్ బీ ) హైదరాబాద్ లో ఆర్థిక, ఎకనామిక్స్ శాస్త్రాలలో ప్రయోగాధార పరిశోధన ద్వారా నైపుణ్య లను మెరుగుపరచుకునేందుకు, ఆయా రంగాల నిపుణులతో పరిచయాలను పెంపొందించు కునేందుకు మే 20 నుంచి 24న తేదీ వరకు వేసవి పాఠశాలను నిర్వహించనున్నట్లు కన్వీనర్ డాక్టర్ అజయ్ కుమార్. వెల్లడించారు, పీహెచ్ డీ విద్యార్థులు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ విద్యార్థులకు పరివర్తన అనుభవాన్ని అందించే లక్ష్యంతో జి ఎస్ బి లోని ఆర్థిక విభాగం దీనిని నిర్వహిస్తున్నట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఆర్థిక, అకౌంటింగ్ పరిశోధనలో నైపుణ్యాలు, జ్ఞానాన్ని పెంపొందించడం కోసం నిర్వహిస్తున్న ఈ వారం. రోజుల కార్యక్రమంలో భాగంగా, జీఎస్ఏ బీలో కొత్తగా స్థాపించిన బ్లూమ్ బెర్గ్ ఫైనాన్స్ ల్యాబ్ ను వినియోగించుకునేలా సెషన్లు రూపొందించినట్టు తెలిపారు. ఈ వారం రోజుల కార్యక్రమంలో పాల్గొనేవారు, కార్పొరేట్ ఫైనాన్స్, కార్పొరేట్ గవర్నెన్స్, బిహేవియరల్ ఫైనాన్స్ / ఎకనామిక్స్ తో పాటు ఎకనామిక పాలసీ చర్చల గురించి తెలుసుకుంటారన్నారు.

పరిశోధనా ఇతివృత్తాలను రూపొందించడం, అనుభానిక పరిశోధనలో విధానపరమైన సవాళ్లను పరిష్కరించడం, ఆచరణాత్మక అంతర్షృష్టులతో నైపుణ్య కథనాలను ప్రభావవంతంగా రాయడం, ప్రచురించడం చేస్తారని డాక్టర్ అజయ్ వివరించారు. అంతేగాక, ఎంపిక చేసుకున్న ఒక ప్రాజెక్టులో పనిచేస్తారని, ఈ కార్యక్రమం ముగిసిన 30 రోజులలోపు ముసాయిదా ప్రాజెక్టు నివేదికను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఐఐఎం నాగపూర్ చెందిన డాక్టర్ సతీష్ కుమార్, ఐఐఎం షిల్లాంగ్ కు చెందిన డాక్టర్ వర్ణీత వంటి ప్రఖ్యాత నిపుణులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా పాల్గొంటారని తెలియజేశారు. పీహెచ్ డీ విద్యార్థులు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ విద్యార్థులు, ఆర్థిక, దాని అనుబంధ రంగాలలో పరిశోధన చేసే వారు కూడా ఈ వేసవి పాఠశాలలో పాల్గొనడానికి అర్హులని డాక్టర్ అజయ్ స్పష్టీకరించారు. పేర్ల నమోదు, రుసుము, వసతి తదితర వివరాల కోసం తన మొబైల్ నెం. 88266 99667ను సంప్రదించాలని, లేదా akumar14@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని కన్వీనర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *