కరపత్రాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్
ఖమ్మం :
అక్టోబర్ ముప్పై ఒకటి న హైదరాబాద్లో నిర్వహించే మాలమహానాడు జాతీయ ప్లీనరీ సభను విజయవంతం చేయాలని కోరుతూ సంబంధించిన పాంప్లెట్ను నగరంలో అంబేద్కర్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షులు కందుల ఉపేందర్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పాల్గొని ఆవిష్కరించి మాట్లాడారు . దళితుల సమగ్రాభివృద్ధికి , సాధికారత ఐక్యత లక్ష్యంగా ఈ ప్లీనరీ సభను నిర్వహించామని , రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు తెలిపిన మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు .
వర్గీకరణ పేరుతో దళితులను విభజించి కోవడం అంబేద్కర్ ఆలోచనా విధానం కాదని కేవలం దళితులను ఓటు బ్యాంకుగా కాకుండా ఐక్యత కుడా చూడాలని కోరారు .అలాగే రైతుల మరణాలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదని పేర్కొన్నారు . జరగబోయే మాలమహానాడు ప్లీనరీ సభకు భారీగా మాలలంతా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి యేర్పుల జానయ్య , జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ గడ్డి కొప్పుల ఆనందరావు , జిల్లా ప్రధాన కార్యదర్శి ఉండేటి శ్రీనివాసరావు ,రూరల్ మండలం అధ్యక్షులు రేoటాలో శ్రీరాములు , చిoతల రవి , కందుల ఎల్లరాజు , కందుల ప్రదీప్ , కొత్త పల్లి కేశవరావు తదితరులు పాల్గొన్నారు .