వివిధ సమస్యల పై డీసీ కి వినతి పత్రం అందజేత….
హైదరాబాద్:
హఫీజ్ పెట్ డివిజన్ లో నెల కొన్న వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ శుక్రవారం చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ను కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపాడు. ముఖ్యంగా హఫీజ్ పెట్ గ్రామంలో మిగిలిపోయిన రోడ్లు, యూత్ కాలనీలో మిగిలిపోయిన రోడ్లు, శాంతినగర్ లో 4 గల్లీలలో చేయవలసిన డ్రైనేజీ లైన్లు పూర్తి చేయాలని కోరారు. హఫీజ్ పెట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయడం కోసం ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు హాస్పిటల్ ని శానిటైజర్ చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పవన్, సాయి గౌడ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.