– ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫ్రొఫెసర్ కాశీం
– విద్యార్థులు చేసిన రాంప్ వాక్,నృత్యాలు , ఆకట్టుకున్నాయి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థులు ఉజ్వల భవిష్యత్ పొందే విధంగా కృషి చేయాలి, లక్ష్యాలని నిర్దేశించుకుంటూ వాటికి అనుగుణంగా కష్టపడాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫ్రొఫెసర్ చింతకింది కాశీం అన్నారు.పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో విశ్వ భారతి లా కళాశాల విద్యార్థులు నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ముఖ్య అతిథి తో కలిసి విశ్వ భారతి లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భవాని, అధ్యాపకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయ, మోడర్న్ దుస్తుల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు చేసిన నృత్యాలుఆకట్టుకున్నాయి.జూనియర్లు, సీనియర్లు తేడా లేకుండా అందరూ కలిసి చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా పలువురు యువతీ,యువకులు ర్యాంపు పై వాక్ చేసి ఆకట్టుకున్నారు. విద్యార్థులో తమ ఉన్న ప్రతిభాపాటవాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల అధ్యాపకులు వర్ష, రమ్య, కీర్తి, అన్వి, పూనం, తేజశ్రీ,గురుమూర్తి, అంబర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.