విద్యార్థులు భావిభారత నిర్దేశకులుగా ఎదగాలి_పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి

politics Telangana

– కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థులు సత్ప్రవర్తనతో రేపటి భావిభారత నిర్దేశకులుగా ఎదగాలని పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ప్రిన్సిపాల్ నాగరాజుతో కలిసి సీఐ వేణుగోపాల్ రెడ్డి స్కూల్ నూతన క్యాలెండర్ 2023ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే మంచిని మాత్రమే తెలుసుకొని, చెడు విషయాల జోలికి వెళ్ళవద్దన్నారు. అపరిచిత వ్యక్తులు మెసేజ్ లు ఫార్వర్డ్ చేసి ఓటీపీలు చెప్పమంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దన్నారు. అలా అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పి చాలామంది విద్యార్థులు, యువత పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకొని మోసపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రులకు మొదటి స్నేహితులుగా ఉంటూ అన్ని విషయాలను పంచుకోవాలని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని, కష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలకు చేరుకొని వారి తల్లిదండ్రులకు, గురువులకు, స్కూల్ కు మంచి పేరు తీసుకురావాలని సీఐ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగరాజు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *