విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి

politics Telangana

– ఇంద్రేశం సర్పంచ్ నర్సింలు, మాజీ ఎంపిటిసి అంతిరెడ్డి

– ది మాస్టర్ మైండ్స్ స్కూల్లో ముగ్గుల పోటీలు

– విజేతలకు బహుమతి ప్రధానం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని ది మాస్టర్ మైండ్స్ స్కూల్లో గురువారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ది మాస్టర్ మైండ్స్ స్కూల్ చైర్మన్ రాజు సంఘాని, డైరెక్టర్ నాగరాజు ల సలహాలు, సూచనల మేరకు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపల్ దీప తెలిపారు. ఈ యొక్క ముగ్గుల పోటీలలో విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని ముగ్గులను వేశారు. ఈ ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి గీత శ్రీ, రెండవ బహుమతి యమున, మూడో బహుమతి ప్రమీల, కన్సోలేషన్ బహుమతి మౌనిక లు గెలుపొందారు. ఈ యొక్క బహుమతులను ముఖ్య అతిథులుగా హాజరైన ఇంద్రేశం సర్పంచ్ నర్సింలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపిటిసి అంతిరెడ్డిగారి అంతిరెడ్డి ల చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతోపాటు అన్ని రంగాల్లో కార్యక్రమాలు చేపడుతున్న ది మాస్టర్ మైండ్స్ యాజమాన్యం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి పండగ విశేషాలన్నీ సందర్భంగా వారు వివరించారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ది మాస్టర్ మైండ్స్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *