మనవార్తలు , నంద్యాల:
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయభేరి మ్రోగించారని కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌళీశ్వర రెడ్డి ,డైరెక్టర్ ఆర్ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు.జూనియర్ ఎంపీసీ విభాగంలో పి.నిఖిత 470 మార్కులకు గాను 463 మార్కులు,కె.వీర పూజిత462 మార్కులు, ఎస్ మూబీన 459 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని వారు తెలిపారు.వీటితో పాటు 450 పైబడి ఎక్కువ మంది విద్యార్థులు మార్కులు సాధించారని ప్రిన్సిపల్ చంద్ర మౌళీశ్వర్ రెడ్డి తెలిపారు.బైపీసీ విభాగంలో ఈ.శివనాగలమల్లేశ్వరి 440 మార్కులకు గాను 423 మార్కులతో కళాశాల టాపర్ గా నిలిచారని కళాశాల యాజమాన్యం తెలిపింది. బీ.రాఘవేంద్ర నాయక్ 408 మార్కులతో రెండవ స్థానం,సి.అమర్ నాథ్ 401 మార్కులతో మూడవ స్థానం సాధించారనట్లు చంద్రమౌళీశ్వర్ రెడ్డి తెలిపారు .
సీఈసీ విభాగంలో ఎం.చంద్రిక 476 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును సాధించింది. బి.నాగేంద్ర 456 ,వి.నాగలక్ష్మీ 415 మార్కులు సాధించారు. కళాశాల ప్రారంభం నుంచి జేఈఈ,నీట్ లాంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమైందని ..ఈ ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపక బృందానికి కళాశాల యాజమాన్యంకు అభినందనలు తెలిపారు .