ఉగాది వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన ఎన్ ఎస్ యూ ఐ, హెచ్ సి యూ విద్యార్థులు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్ ఎస్ యూ ఐ విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యదపూర్వకంగా కలిశారు. ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో గురువారం కలిసి, హెచ్లో సి యూ లో నిర్వహించే ఉగాది వేడుకలకు రావాలని ఆహ్వానించారు. అనంతరం వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూ ఐ హెచ్ సి యూ ఇంచార్జ్ అజయ్, ప్రెసిడెంట్ నేహా జయరాజ్ కోఆర్డినేటర్ పట్లోళ్ల శ్రీరామ్ యాదవ్, షరీఫ్, రచన, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *