స్వతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు

politics Telangana

– సిఐటియు ద్వారానే సమస్యలు పరిష్కారం

– ఈనెల 14న దేశవ్యాప్త నిరసనలు

– కిర్బీ పరిశ్రమలో హ్యాట్రిక్ విజయమందించిన కార్మికులకు విప్లవ అభినందనలు
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

స్వతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు. శనివారం పటాన్ చెరు పట్టణంలోని ఐలా భవన్ లో జరిగిన కిర్బీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం లో రాములు మాట్లాడుతూ మోడీని అధికారం నుంచి దించుతేనే కార్మిక వర్గానికి, దేశానికి, ప్రజలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడి ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 14వ తేదీన దేశవ్యాప్తంగా మోడీ విధానాలపై నిరసన చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఆ నిరసనలో కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు, వరుసగా మూడోసారి గెలిపించినందుకు విప్లవ అభివందనములు తెలియజేశారు, సీఐటీయు ద్వారానే కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. కార్మికుల హక్కులు, సౌకర్యాల కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. కార్మికులకు నిరంతరం సేవ చేసే కార్మిక సంఘం సీఐటియు అన్నారు. కార్మికులు రాబోయే కాలంలో ఐక్య పోరాటాలకు సిద్ధపడాలని ఐక్య పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే రాజయ్య, యూనియన్ జనరల్ సెక్రటరీ విఎస్ రాజు ,మల్లేశం, లకన్ ,సుధాకర్, నాగప్రసాద్, తలారి శీను, రాజేష్, మహేశ్వర్ రెడ్డి, వీరప్ప, ప్రభు తదితర కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *