ప్రజలకు మరింత నాణ్యమైన విద్యుత్తు
ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గృహాలకు, పరిశ్రమలకు మరింత నాణ్యమైన విద్యుత్ అందించాలన్న సంకల్పంతో కోటి రూపాయలతో పటాన్చెరు సబ్ స్టేషన్లో 12.5 mva పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, విద్యుత్ సంస్థ ఉన్నత అధికారులతో కలిసి ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోజురోజుకీ జనాభా పరంగా విస్తరిస్తున్న పటాన్చెరు డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగం పెరిగినందున నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సంస్థ సీఎండీ తో పలు దఫాలు చర్చించడం జరిగిందని పేర్కొన్నారు.
కోటి రూపాయలతో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో పాటు మరో కోటి రూపాయలను విద్యుత్ లైన్లను పటిష్టం చేసేందుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.మూడు కొత్త ఫీడర్ లైన్లు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిఈ రమేష్ చంద్ర, ఏ డీ ఈ దుర్గాప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, ట్రాన్స్కో సిబ్బంది పాల్గొన్నారు.