రసాయన శాస్త్రంలో శ్రీనివాస్ నక్కాకు పీహెచ్.డీ.

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి శ్రీనివాస్ నక్కా డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘ఎల్సీ-ఎంఎస్ పద్ధతి కోసం వ్యూహాత్మక విధానాలు AQbD, గ్రీన్ కెమిస్ట్రీ సూత్రాలను ఉపయోగించి ఫార్మాస్యూటికల్స్ లో NDSRIల అభివృద్ధి’ చేసి, ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఎస్. సురేంద్ర బాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఆధునిక ఔషధ తయారీలో కీలకమైన భద్రతా సమస్య అయిన నైట్రోసమైన్ ఔషధ పదార్థ సంబంధిత మలినాలను (NDSRIలు) గుర్తించడం, నియంత్రించడంపై డాక్టర్ శ్రీనివాస్ పరిశోధన దృష్టి సారించినట్టు తెలియజేశారు. సిప్రోఫ్లోక్సాసిన్, మోక్సిఫ్లోక్సాసిస్ వంటి యాంటీబయాటిక్స్, అసెక్లోఫెనాక్, మెఫెనామిక్ యాసిడ్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలు, ఆల్పా-1 బ్లాకర్ టామ్సులోసిన్ వంటి కీలకమైన ఔషధ తరగతులలో NDSRIలను లెక్చించడానికి వీలుగా అత్యంత సున్నితమైన UPLC-MC/MS పద్ధతులను ఈ అధ్యయనంలో అభివృద్ధి చేసినట్టు వివరించారు. ఇవి సురక్షితమైన మందులని,నియంత్రణకుఉపకరిస్తాయన్నారు.డాక్టర్ శ్రీనివాస్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించే ప్రభావవంతమైన పరిశోధనలకు గీతం నిబద్ధతను ఈ విజయం ప్రతిబింబిస్తోందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *