చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు విరాళం అందజేసిన శ్రీకాంత్ గౌడ్

Districts politics Telangana

మనవార్తలు,పటాన్ చెరు:

పటాన్ చెరు నియోజకవర్గం భానుర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు 5,00,000/- ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందజేసిన పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్  ,ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ న్యాయం విషయంలో శివాజీ ఎన్నడు కూడా రాజీపడలేదని. ఆయన విశిష్ట నాయకత్వం, సాంఘిక సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత తరతరాలుగా ప్రజలకు స్ఫూర్తిదాయకమని ఛత్రపతి శివాజీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని మొఘలులను గడగడలాడించి ఆనాడే సమానత్వ సాధనకు ఛత్రపతి శివాజీ ఎంతో కృషి చేశారని, హిందుత్వాన్ని అనుసరిస్తూ అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని అటువంటి మహనీయుని విగ్రహ ప్రతిష్టాపనకు విరాళం అందజేయడం చాల  ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్లంరాజి రెడ్డి  ,అల్లం శ్రీనివాస్ రెడ్డి  ,రెడ్డి పల్లి శ్రీనివాస్ , నామా శేఖర్ , బీజేవైఎం పటాన్ చెరువు అధ్యక్షుడు అచ్చిని శివ,నాయి శివ మరియు సందిప్  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *