మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్చెరు డివిజన్ పరిధిలోని నందన్రతన్ ప్రైడ్ కాలనీలో మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్లమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేస్తుండటం సంతోషకరమన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ పటాన్చెరు నియోజకవర్గం అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి జైపాల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట రెడ్డి, విజయ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.