పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాలను అందంగా విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల రద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సీతారామ హనుమాన్ దేవస్థానంలో రాములోరి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు . స్వామి వారికి గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి దంపతులు స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు చీరలు సమర్పించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు .ఈ సందర్భంగా సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ. పుణ్య దంపతులైన సీతా రాముల శుభాశీస్సులతో అందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉండాలన్నారు. గ్రామం సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలన్నారు. రుద్రారం గ్రామ ప్రజలందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య , ఎంపీటీసీలు మన్నె రాజు, హరిప్రసాద్ రెడ్డి,వార్డు సభ్యులు సందీప్ గౌడ్, పేoటేష్ , శ్రీనివాస్, రాజిరెడ్డి, ప్రభు ,వంశీ ,లక్ష్మారెడ్డి, నారాయణరెడ్డి ,సతీష్ గౌడ్, శ్రీనివాస్ , ప్రభు, మరియు సభ్యులు,సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు ,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, మహిళలు ,భక్తులు ,వివిధ సంఘాల యువకులు, తదితరులు పాల్గొన్నారు.