మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఆషాడ మాసం పురస్కరించుకొని బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఫలహారం బండి పోతురాజుల నృత్యాలతో ఘనంగా పలారం బండి ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నీ ఘనంగా గజమాలతో స్వాగతం అలిగారు .
అనంతరం మాట్లాడుతూ ఆషాడ మాసం బోనాలు పురస్కరించుకొని పలారం బండి ఊరేగింపు నిర్వహించాము ఇస్నాపూర్ గ్రామం మరియు పటాన్ చెరు నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని గత రెండు సంవత్సరాలు నుండి జరుపుకోలేమని అమ్మవారి ఆశీస్సులు ఇస్నాపూర్ గ్రామ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలు అందరూ చల్లగా సుఖశాంతులతో ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జీజేఆర్ యువసేన అధ్యక్షులు గోపిరెడ్డి గారు సునీల్ రెడ్డి, మరియు ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి ,విక్రమ్ రెడ్డి,వెంకట్ ,విష్ణు ,మీరాజ్ ఖాన్ నారాయణదాసు శేఖర్ రెడ్డి ,కృష్ణారెడ్డి ,బండరాజు, జీజేఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
