శ్రీ చైతన్య నల్లగండ్ల విద్యార్థులు 2024 2025 అకాడమిక్ సంవత్సరంలో మరో విజయo సొంతం

Hyderabad politics Telangana

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

శ్రీ చైతన్య నల్లగండ్ల బ్రాంచ్ విద్యార్థులు ఐ ఎన్ టి ఎస్ ఓ పరీక్షల్లో విజేతలుగా నిలిచారు. నల్లగండ్ల బ్రాంచ్లో ఐఎన్టీఎస్ ఓ పరీక్ష విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు..ఈ పరీక్షల్లో విజేతలుగా గ్రాండ్ ప్రైజ్ విజేతగా శ్రియసలోని లాప్టాప్ బహుమతి అందుకోగా, ప్రథమ స్థానంలో శ్రావ్య శివాని ట్యాబ్ ని బహుమతిగా గెలుచుకున్నది. వరుసగా రెండవ స్థానంలో తన్వి, అక్షత్ నాయుడు, మూడవ స్థానంలో అఖిలేష్, వెంకట కార్తికేయ నాలుగవ స్థానంలో మాల శ్రీ సాహు, ఫిరోజా, కుమార్ చైతన్య ఐదవ స్థానంలో చిన్మయి మోడీ బంగారు పథకాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శివరామకృష్ణ ఆర్ ఐ అనిత మేడం ,జోనల్ కోఆర్డినేటర్ అన్నపూర్ణ, నల్లగండ్ల బ్రాంచ్ ప్రిన్సిపల్ వాణి, ప్రైమరీ ఇన్చార్జ్ అమలా, డీన్ నాగరాజు టెన్త్ ఇంచార్జ్ రంగా అండ్ లక్ష్మీ లు పిల్లలకు బహుమతులు అందజేశారు . మరియు ప్రపంచ వరల్డ్ రికార్డులో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదానోత్సవం జరిగింది .ఈ కార్యక్రమంలో ఆర్ ఐ అనిత మాట్లాడుతూ పిల్లలు ఇలాగే అన్ని రంగాలలో విజయం సాధించాలని కోరుకున్నారు.
నల్లగొండ ప్రిన్సిపాల్ వాణి మాట్లాడుతూ అన్ని విధాల సహకరించిన శ్రీ చైతన్య మేనేజ్మెంట్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే పిల్లలు అన్ని రంగాలలో విజయం సాధించాలని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *