రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :
యువనాకుడు శ్రీ బాలాజి ఫౌండేషన్ చైర్మెన్ బలరాం జన్మదినాన్ని పురస్కరించుకుని అయిలాపురం నవీన కుమార్ భగవద్గీత ను బహుకరించారు .అనంతరం శ్రీ బాలాజి ఫౌండేషన్ చైర్మెన్ బలరాం మాట్లాడుతూ ప్రపంచశాంతిని సర్వజనహితాన్ని, వ్యక్తిత్వ వికాసానికి కృష్ణపరమాత్ముడు రచించిన భగవత్ గీత దోహదపడుతుందని ప్రతీ ఒక్కరు భగవత్ గీతపఠించాలని జన్మదినాలు శుభకార్యలకు భగవద్గీతను బహుకరించడం నేర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టుశ్రీధర్, భవాని, శంకర్, మాధవ్, రాకేష్, సంతోష్, యాదగిరిరావు, ప్రవీణ్, మహేష్, సుధాకర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.