గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తి ముఖ్యం

Lifestyle Telangana

_అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో

_ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆటలలో గెలుపు, ఓటమిలను సమానంగా స్వీకరించాలని, ఎప్పుడూ ఓటమికి కుంగిపోకూడదని ప్రముఖ శిక్షకుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్, ఉద్బోధించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ‘గస్టో – 2024’ పేరిట నిర్వహిస్తున్న అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలను గురువారం ఆయన క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగపురి రమేష్ మాట్లాడుతూ, ఐక్యత, క్రీడాస్ఫూర్తి, దృఢత్వం వంటి లక్షణాలను పెంపొందించడంలో క్రీడల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆయా పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేయాలని, క్రీడల యొక్క నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించాలంటూ క్రీడాకారులను ప్రోత్సహించారు. క్రీడలలో పాల్గొనడం ద్వారా ఆయా వ్యక్తులు సమాజంలో ఎలా కలిసిపోవాలో, జట్టులో సమర్ధవంతంగా ఎలా పనిచేయాలో నేర్చుకుంటారని చెప్పారు. అభ్యాసం చేసేటప్పుడూ, పోటీ పడేటప్పుడు, రెండు సందర్భాలలోనూ క్రమశిక్షణ ముఖ్యమని స్పష్టీకరించారు. వినూత్న ఆలోచనలతో పాటు క్రీడల వల్ల ఒనగూరే బహుముఖ ప్రయోజనాలను రమేష్ వివరించారు.

మానసిక ఉల్లాసానికి, సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడల ప్రాముఖ్యతను సభాధ్యక్షత వహించిన గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీఏసీఎస్ఆర్ వర్మ నివరించారు, క్రీడల పట్ల ఉత్సాహం, నిబద్ధతతో గస్టోలో పాల్గొంటున్న క్రీడాకారులను స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. నారాయణరావు చౌదరి అభినందించారు. మూడు రోజుల పోటీల గురించి స్పోర్ట్స్ మేనేజర్ తపస్వి వివరించారు. ఈ టోర్నమెంట్ క్రికెట్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, త్రోబాల్, వెస్, బాస్కెట్బాల్ వంటి వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని దాదాపు 26 కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన జట్టు వివిధ పోటీలలో పాల్గొంటున్నాయి.గస్టోలో పాల్గొనేవారిలో అథ్లెటిసిజం, క్రీడా నెపుణ్యం, ఐక్యతను పెంపొందించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు శుక్రవారంతో ముగియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *