పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థి దశనుండే క్రీడా స్ఫూర్తిగా పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ద్వితీయ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుపై చూపిన శ్రద్ధ క్రీడలపై కనపరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రీడారంగంలో భారతీయుల పాత్ర అతి తక్కువగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు తగు ప్రాధాన్యత అందించడంతోపాటు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోనూ మినీ స్టేడియాలతో పాటు క్రీడా పోటీలను ఏర్పాటు చేస్తూ క్రీడారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.