మనవార్తలు, జిన్నారం:
గ్రామాల్లో దేవాలయాలు నిర్మించి ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందే విధంగా కృషి చేయడం చాలా శుభపరిమాణమని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు జిన్నారం మండలం అండూరు గ్రామంలో జరిగిన పోచమ్మ జాతర లో ముఖ్య అతిథిగా హాజరయ్యి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో యువజన సంఘం నాయకులు నిర్వహించిన ఫలహారం బండికి పూజలు నిర్వహించారు అనంతరం గడ్డపోతారం లో నిర్వహించిన పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సర్పంచ్ ప్రకాశంచారి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ను ఘనంగా సత్కరించారు.
అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ప్రార్ధన మందిరాలకు సమ ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయిస్తున్నారని పండుగలకు దుస్తులు గిఫ్ట్ లు , పంపిణీ చేస్తున్నారని ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని తెరాస ప్రభుత్వం పండుగలను అహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకునేలా చేస్తోందన్నారు .
ఈ కార్యక్రమంలో గడ్డపోతారం సర్పంచ్ పులిగిల్ల ప్రకాష్ చారి, ఎంపీటీసీ జనాబాయి, ఉప సర్పంచ్ మమతా పేంటేష్,గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నారబోయిన కుమార్, జిన్నారం మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అశోక్, ఎన్ శ్రీనివాస్, వార్డు సభ్యులు నర్సింగ్ రావు, కార్తీక్, వీరేశం గౌడ్,సత్యనారాయణ, రాములు, లక్ష్మణరావు, కృష్ణమోహన్, బీ నర్సింలు, ఎన్ నర్సింలు, దేవయ్య, బాబు,మాణిక్యం,ప్రదీప్,మహేష్,నరేష్, శ్రీకాంత్,అండుర్ వార్డు సభ్యులు రాములు, శ్రీశైలం,ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు