సికింద్రాబాద్ ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యూనియన్ మీటింగ్ సికింద్రాబాద్ పరిధిలోని డైమండ్ పాయింట్లో విజయవంతంగా కొనసాగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.బి.ఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ ప్రెసిడెంట్ నరేంద్ర కుమార్ డిప్యూటి జనరల్ సెక్రటరీ శ్రీనివాస చారి హాజరయ్యారు అనంతరం సభ్యుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు యూనియన్ జనరల్ సెక్రటరీ అంజిల్ ప్రెసిడెంట్ సజో జోష్ లు సెంతిల్ కుమార్ మెట్టుశ్రీధర్ ఆనంద్ కుమార్ లు తెలిపారు . మరియు సౌత్ ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సంధర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అంజిల్ మాట్లాడుతూ సభ్యుల సమస్యల పరిష్కారానికి యూనియన్ ఎల్లప్పుడు సహకరిస్తుందని మన ఐక్యతే మనబలమని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసిన మెట్టుశ్రీధర్ను అభినందించారు .
