పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
‘ట్వీట్ల సెంటిమెంట్ ను విశ్లేషించడం కోసం మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ల అభివృద్ధి’పై పరిశోధన చేసి, దానిపై a సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఝాన్సీ రాణి తిరుమలశెట్టిని డాక్టరేట్ వరించింది. హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి ఆమె ఈ పట్టాను అందుకున్నారు. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ కె. అనూరాధ మార్గదర్శనంలో ఈ పరిశోధనను చేపట్టినట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ట్వీట్ల పరిమాణంలో విపరీతమైన పెరుగుదలను ఎదుర్కోవడానికి మెషిన్ లెర్నింగ్ని ఉపయోగించి, మానసిక భావనల (సెంటిమెంట్) విశ్లేషణ ఆవశ్యకతపై ఆమె దృష్టి సారించిందన్నారు. సామాజిక వెబ్ డేటా, పరిశోధన సెంటిమెంట్ విశ్లేషణలో అధిక పరిమాణం సమస్యను కూడా పరిష్కరించినట్టు తెలిపారు. దీని ఫలితంగా తక్కువ అంచనా ఖచ్చితత్వం, తప్పుడు హెచ్చరికలు అధిక సంఖ్యలో ఏర్పడ్డాయన్నారు. ఝాన్సీ రాణి సమర్పించిన సిద్ధాంత వ్యాసం జెఎన్టీయూ హైదరాబాద్ నుంచి పీహెచ్ డీ పట్టా సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి, అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ మహబూబ్ బాషా షేక్, పలు విభాగాల అధిపతులు, అధ్యాసకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.