పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని తనూ శ్రీవాస్తవను డాక్టరేట్ వరించింది. ఏరోస్పేస్ అప్లికేషన్స్ కోసం థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమెపై అభివృద్ధి, అధ్యయనం’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్ కుమార్ కూరి, ప్రొఫెసర్ రావూరి బాలాజీరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని నెల్లడించారు.కఠినమైన ఉష్ణ, వాతావరణంలో ఏరోస్పేస్ వాహనాలకు ఉపయోగపడే కొత్త థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్లను అభివృద్ధి చేయడం, ఫంక్షనల్ ట్రయల్స్ ప్రాపర్టీ మూల్యాంకనం చేయడం ఈ పరిశోధన లక్ష్యంగా పేర్కొన్నారు. అధ్యయనం ప్రధానంగా తక్కువ సాంద్రత కలిగిన అబ్లేటివ్ పదార్థాలు, ఖర్చుతో కూడుకున్న వాటిపై దృష్టి పెట్టిందన్నారు. ఈ పరిశోధన ప్రధాన ఫలితాలు అభివృద్ధి చెందిన ఉష్ణ రక్షణ వ్యవస్థలు తీవ్ర వాతావరణాలలో అధిక-ఉష్ణోగ్రత అనువర్తనాల కోసం నిరూపించబడినట్టు తెలిపారు. అల్లేటివ్ సదార్థాలు ఇప్పటికే ఉన్న వ్యవస్థల కంటే మెరుగైనై లక్షణాలు, తక్కువ నుంచి మధ్యస్థ సాంద్రత కలిగి ఉన్నాయని నిరూపించినట్టు పేర్కొన్నారు.తనూ శ్రీవాస్తవ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె. నగేష, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
