మనవార్తలు , పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ఇటీవల హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీలతో అవగాహనా ఒప్పందం ( ఎంవోయూ ) కుదుర్చుకున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ఈ అవగాహనా ఒప్పంద పత్రాలపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , హెటెరో కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ ఎస్.వీ.జయపాల్రెడ్డి సంతకాలు చేసినట్టు తెలియజేశారు . హెటెరో కంపెనీలోని అర్హత కలిగిన ఉద్యోగులకు డాక్టోరల్ డిగ్రీ ( పీహెచీ ) ని చదవడానికి ప్రవేశాలు కల్పించే లక్ష్యంతో ఈ అవగాహనను కుదుర్చుకున్నారు .
పీహెచ్ఐని చదవాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థుల జాబితాను తొలుత కంపెనీ పంపుతుందని , అందులో అర్హత గల అభ్యర్థుల జాబితాను విశ్వవిద్యాలయానికి సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు . హెటెరో ఉద్యోగుల నెపుణ్యాలకు పదును పెట్టడానికి గాను యాజమాన్య వికాస కార్యక్రమా ( ఎండీపీ ) లను గీతం నిర్వహిస్తుందన్నారు . ఉభయ పక్షాలు రద్దుచేసుకునే వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుందని తెలిపారు . ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , గీతం బిజినెస్ స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ , కెరీర్ గెడైన్స్ సెల్ డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ , ఇతర అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు .