సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ ఓల్డ్ విలేజ్ లో సీనియర్ నాయకులు టీ. మేఘన రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 105వా జన్మదిన సందర్బంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు . రవీందర్ రెడ్డి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పుణికిపుచ్చు కొన్న నిర్దేశకుడు పండిత్ దీన్ దయాల్ గారు భారతీయ సమాజానికి అనువైన విధంగా ఒక నూతన ఆర్థిక విధానాన్ని ప్రతిపాదించారు దీన్ దయాల్ అదే ఏకాత్మ మానవతా వాదం అదే స్ఫూర్తిని గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీన్ దయాల్ సిద్ధాంతాలను ఆదర్శాలను అంకితభావంతో పాటిస్తూ దేశంలో పలు సంస్కరణలను వేగవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు టీ.రవీందర్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబెర్ శారద ,రాఘవేంద్ర రెడ్డి, సమ్మయ్య, బి. రాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు డి. స్రవంతి నరసింహ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రోహిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.