_ధ్వంసమైన క్రీడా ప్రాంగణం
– చర్యలు తీసుకోవడంలో విఫలమైన జిహెచ్ఎంసి అధికారులు.
_సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
చిన్నారుల ఆహ్లాదం కోసం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన క్రీడా ప్రాంగణం పూర్తిగా ధ్వంసం అయింది. క్రీడా ప్రాంగణానికి ఆనుకొని జరుగుతున్న ఓ నిర్మాణ వ్యర్ధాలను, సామాగ్రిని క్రీడా ప్రాంగణంలో వేయడంతో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. నిత్యం ప్రజాప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఖరీదైన సొసైటీ స్థలం అన్యాక్రాంతం అవుతున్న కోట్ల రూపాయల విలువ చేసే స్థలం కబ్జాకు గురవుతున్నా అధికారులు గాని, సొసైటీ సభ్యులు గాని చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల పాత ఎం. ఐ. జి కాలనిలో గతం లో చిన్నపిల్లలు స్థానిక టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు సంబంధించిన నిర్మాణం కావడంతోనే సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు వెనకడుగు వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో కోటిన్నర విలువచేసే ఖరీదైన స్థలం కబ్జా అవుతున్నా సొసైటీ సభ్యులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పార్కులో ఏర్పాటు చేసిన క్రీడా సామాగ్రి పూర్తిగా ద్వoసమవడంతో చిన్నారులకు క్రీడా ప్రాంగణం కరువైందని చుట్టుపక్కల వారు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు జి. హెచ్. ఎం. సి. అధికారులు గాని, సొసైటీ సభ్యులు గాని ఎందుకు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు.