కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం నీలం మధు ముదిరాజ్

politics Telangana

మాట ఇచ్చి నిలబెట్టుకున్న రాహుల్ గాంధీ

సీఎం రేవంత్ చొరవతో బలహీన వర్గాలకు మంత్రి వర్గంలో ప్రాధాన్యం

ముదిరాజ్ లకు పెద్ద పీట వేసిన కాంగ్రెస్ పార్టీ 

స్థానిక సంస్థల ఎన్నికల్లోను అన్నివర్గాలకు ప్రాధాన్యత 

రాహుల్ గాంధీ, రేవంత్,పీసీసీ చిత్రపటాలకు పాలాభిషేకం 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ మంత్రి వర్గ కూర్పులో బహుజనులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ గౌడ్ గార్ల చిత్రపటాలకు చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్,కరీంనగర్,రాజన్న సిరిసిల్ల,రంగారెడ్డి,మెదక్,జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ఎన్ఎంఆర్ యువసేన సోషల్ మీడియా ప్రతినిధులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ బహుజన రాజ్యాధికారం సాధిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు.తెలంగాణ మంత్రి వర్గంలో సామాజిక సమీకరణల ఆధారంగా బీసీ ముదిరాజ్ నుంచి వాకాటి శ్రీహరి,ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి,అడ్లూరి లక్ష్మణ్ లకు మంత్రి పదవులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతోనే బడుగు బలహీన వర్గాల నాయకులకు ముఖ్యంగా ముదిరాజ్ బిడ్డకు మంత్రి వర్గంలో పెద్ద పీట వేశారని కొనియాడారు.బీసీ కుల గణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిన రేవంత్ సర్కార్ జనాభా దామాషా ను ఆచరణలో పెట్టీ మంత్రి వర్గంలో అన్ని కులాలను భాగస్వామ్యులను చేశారని వివరించారు.బహుజనులకు పెద్ద పీట వేసిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని కులాలకు అవకాశాలు కల్పించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *