Telangana

బీహెచ్ఈఎల్ స్థల వివాదంపై న్యాయం చేయాలని స్నేహ సొసైటీ సభ్యుల విజ్ఞప్తి

– కోర్టు ఆదేశాల మేరకు సర్వే, పంచనామాతో హద్దులు నిర్ధారణ

– రూ.20 లక్షలతో నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను కూల్చివేశారని ఆరోపణ

– తుది తీర్పు వరకు జోక్యం చేసుకోవద్దని బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి విజ్ఞప్తి

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :

బీహెచ్ఈఎల్ స్థలానికి సంబంధించిన వివాదంలో తమకు న్యాయం చేయాలని స్నేహ సొసైటీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని, బీహెచ్ఈఎల్ యాజమాన్యాన్ని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారికంగా సర్వే, పంచనామా నిర్వహించి తమ స్థలానికి హద్దులు నిర్ధారించినప్పటికీ, కాంపౌండ్ వాల్‌ను కూల్చివేశారని వారు ఆరోపించారు.రామచంద్రపురం మండలం బీహెచ్ఈఎల్‌లో సుమారు 40 ఏళ్లపాటు పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు కలిసి స్నేహ సొసైటీని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 55 ప్రకారం సొసైటీలోని 49 మంది సభ్యులకు భూమి కేటాయించినట్లు పేర్కొన్నారు. అనంతరం టీఎస్‌ఐఐసీకి ఎకరాకు రూ.90 లక్షల చొప్పున మొత్తం రూ.3.45 కోట్లు చెల్లించి అధికారికంగా సేల్ డీడ్‌లు పొందినట్లు తెలిపారు.అయితే స్థల సర్వే విషయంలో బీహెచ్ఈఎల్ యాజమాన్యం నుంచి పూర్తి సహకారం అందకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు సొసైటీ సభ్యులు వివరించారు. కోర్టు ఆదేశాల మేరకు సంగారెడ్డి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో సర్వే, పంచనామా నిర్వహించి స్థల హద్దులను నిర్ధారించినట్లు తెలిపారు.

అనంతరం ఇంజక్షన్ ఆర్డర్ పొందిన తర్వాత సుమారు రూ.20 లక్షల వ్యయంతో తమ స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నామని చెప్పారు.అయితే గోడ నిర్మించిన కొద్ది రోజులకే బీహెచ్ఈఎల్ ఎస్టేట్ అధికారి వెంకటేశం సిబ్బందితో వచ్చి కాంపౌండ్ వాల్‌ను కూల్చివేశారని సొసైటీ సభ్యులు ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు తెలిపారు.తాము బీహెచ్ఈఎల్ స్థలంలో ఒక్క గజం కూడా ఆక్రమించలేదని, తమ వద్ద ఉన్న సేల్ డీడ్, జీఓ, అధికారిక సర్వే వివరాల ప్రకారం తమకు కేటాయించిన 3 ఎకరాల 31 గుంటల స్థలంలోనే ఉన్నామని సొసైటీ సభ్యులు స్పష్టం చేశారు. 70 ఏళ్లు పైబడిన రిటైర్డ్ ఉద్యోగులమైన తమపై అధికారుల జోక్యం, ఒత్తిడి తగదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థల వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున తుది తీర్పు వెలువడే వరకు ఎవరూ జోక్యం చేసుకోకుండా చూడాలని, తమకు కేటాయించిన స్థలంపై చట్టబద్ధమైన హక్కులను కాపాడాలని వారు కోరారు. కోర్టు తీర్పు మేరకు తదుపరి చర్యలు తీసుకునేలా ప్రభుత్వం, బీహెచ్ఈఎల్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చట్టబద్ధంగా ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సాయిలు, లక్ష్మీనారాయణ, నారాయణరెడ్డి, శ్రీనివాస్, నాగరాజు, నరసయ్య, రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

14 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

17 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

19 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

19 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

19 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago