రాజమండ్రి
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం పొట్టిలంక గ్రామం కు చెందిన అంకం వీరబాబు అనే వికలాంగుడు గత నెలలో రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ గారు పొట్టిలంక గ్రామ పర్యటనలో ఉండగా అంకం వీరబాబు చందన నాగేశ్వర్ గారిని కలిసి తనకు వికలాంగుల ట్రై సైకిల్ కావాలి అని కోరారు.
దానికి స్పందించిన చందన నాగేశ్వర్ గారు ఈ రోజు వారి పార్టీ కార్యాలయంలో అంకం వీరబాబుకు వికలాంగుల ట్రై సైకిల్ ను అందించారు. అంకం వీరబాబు చందన నాగేశ్వర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పొట్టిలంక వైఎస్ఆర్సిపి నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వర రావు, నూలు మల్లేశ్వరరావు, కర్ర ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.