శ్రీకాకుళం జిల్లా పొందూరు మండంల తండ్యంలోని మూడు మర్రిచెట్లు వద్ద ఘనంగా శివ లింగ ప్రతిష్ట

Andhra Pradesh politics

_ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఏపి రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి

పొందూరు ,మనవార్తలు ప్రతినిధి :

కాశీని తలపించే పుణ్యక్షేత్రంగా పేరున్న శ్రీ త్రినాథ త్రివటిధర్మ క్షేత్రం ప్రాంగణంలో స్వయంభుగా వెలసిన మూడు మర్రి చెట్లువద్ద దండి గణపతి సమేత కాశీ విశ్వేశ్వర లింగం ప్రతిష్ట కార్యక్రమం కనులపండువగా సాగింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తండ్యాం పంచాయతీ పరిధిలో లక్షింపేట రహదారి సమీపంలోఉన్న ఈ మూడు మర్రి చెట్లు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినవి. త్రినాథ స్వామి దైవంగా భావించే త్రినాథ త్రివటి ధర్మక్షేత్రం వద్దకు పొందూరు పట్టణానికి చెందిన కిల్లి రాజ మోహన్ రావు నిష్టతో కాశీ నుండి శివలింగాన్ని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శనివారం నాడు. పురోహితులు కూనపులి రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో కిల్లి రాజమోహన్ రావు శారద దంపతులు, హైదరాబాద్ కు చెందిన కిల్లి అఖిల్ బాబా వారిచే ఘనంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం రక్షా సూత్రధారణ, పరిషత్ ప్రాయశ్చిత రుద్ర హెూమం, విష్ణు, పూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసా నంద సరస్వతీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రతిష్టా కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించి భక్తులకు మూడు మర్రి చెట్లు విశిష్టతను త్రినాథ స్వాముల మహిమను ప్రవచనాల రూపంలో వివరించారు. సాక్షాత్తు బ్రహ్మ, మహేశ్వరులు వృక్ష రూపంలో కొలువు దీరిన పుణ్యక్షేత్రంగా ఈ క్షేత్రం పేరు గాంచిందని తెలిపారు. ఇంతటి మహిమగల క్షేత్రాన్ని ప్రతీ ఒక్కరూ సందర్శించి త్రినాధుల స్వామి అనుగ్రహాన్ని పొందాలని అన్నారు. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. మరెంతో మంది దాతలు ముందుకొచ్చి ఈ పుణ్య క్షేత్రాన్నిమరింత అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం వచ్చే పుణ్య భక్తులకు అఖిల్ బాబా ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ ప్రతిష్టా కార్యక్రమంలో తండ్యాం సర్పంచ్ ప్రతినిధి కిలారి భాస్కర రావు, బాణం సర్పంచ్ ప్రతినిధి పెద్దింటి రవిబాబు, తవిటి రెడ్డి, కంబావు సూర్యారావు, పొందూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ రేగిడి లక్ష్మీ, తహశీల్దార్ రాంబాబు, ఎస్. సంఘం సభ్యులు ప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఐ లక్ష్మణ రావు, జ్యోతి స్వామి, ప్రసాద్ భవానీ, కంచి కామాక్షి తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *