ఫలాల అలంకరణలో సిద్ధి గణపతి

Telangana

శ్రీ గణేష్ గడ్డపై ఘనంగా నవరాత్రి ఉత్సవాల ముగింపు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

శ్రీ గణేష్ గడ్డపై వెలసిన సుప్రసిద్ధ దివ్యక్షేత్రం శ్రీ సిద్ధ వినాయక ఆలయంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో ముగింపు దశకు చేరుకున్నాయి. నవరాత్రుల భాగంగా నేడు చివరి రోజు శ్రీ సిద్ధ వినాయక స్వామి వివిధ రకముల ఫలాలతో విశేష వర్ణంతోభక్తులకు ప్రత్యేక దర్శనమిస్తున్న సిద్ధి గణపతి  పాటు నిత్య పూజలు, హోమాలు, విశేష అలంకారాలతో భక్తులను పరవశింపజేసిన శ్రీ సిద్ధ వినాయక స్వామివారు ఉత్సవాల చివరి రోజైన నేడు ‘ఫలాకృతి దివ్య రూపం’లో భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు.

కన్నులపండువగా విభిన్న ఫలాల విశేష అలంకరణ:

నవరాత్రుల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి శోభాయమానంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగురంగుల, వివిధ రకాల తాజా ఫలాలతో (ఆపిల్, అనాస, ద్రాక్ష, దానిమ్మ, అరటి తదితర పండ్లతో) స్వామివారి మూలవిరాట్టును, ప్రాంగణాన్ని కన్నులపండువగా అలంకరించారు. విభిన్న వర్ణాల శోభతో మిలమిలలాడుతున్న స్వామివారి దివ్య అలంకరణ రూపాన్ని చూసి భక్తులు మైమరచిపోతున్నారు.నవరాత్రుల ముగింపు పర్వదినాన శ్రీ సిద్ధ వినాయక స్వామివారి దివ్య మంగళ రూపాన్ని తిలకించి, పూజలు నిర్వహించిన భక్తులు స్వామివారి కృపాకటాక్షాలు పొంది తరించిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *