మనవార్తలు , పటాన్ చెరు:
ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితం మనందరికీ ఓ ప్రేరణ అని గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ . శివప్రసాద్ అన్నారు . హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శివాజీ 392 వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు . ప్రాంగణంలో నెలకొల్పిన శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలు చల్లి నివాళి అర్పించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , శివాజీ మహరాజ్ 1630 ఫిబ్రవరి 19 న శిన్నేరి కోటలో జన్మించారని , గొప్ప పరిపాలకుడిగా , ఉదార పౌర పాలన స్థాపకుడిగా కీర్తిని పొందారని చెప్పారు . ఆయన గాథలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , ఇతర డెరైక్టర్లు , పలువురు అధ్యాపకులు , సిబ్బంది , విద్యార్థులు ఈ జయంతి వేడుకలలో పాల్గొని శివాజీ మహరాజ్కు నివాళి అర్పించారు . ఆయన గాథలను స్మరించుకున్నారు.