రేపటి నుండి తెరుచుకొనున్న శిల్పారామం…
హైదరాబాద్:
కాంక్రీట్ జంగిల్ గా మారిన శిల్పారామం నగర వాసులు పల్లె అందాలతో, గ్రామీణ వాతావరణంతో అలరించేది. కానీ లాక్ డౌన్ వల్ల గత కొన్ని రోజులుగా సందర్శకులను అనుమతిoచలేరు.తెలంగాణ లో లాక్ డౌన్ పూర్తి స్థాయి లో ఎత్తి వేసిన నేపధ్యం లో మాదాపూర్ లో నెలకొని ఉన్న శిల్పారామం సందర్శకుల కోసం సోమవారం నుండి తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు. పచ్చని ప్రకృతి అందాలతో , కొత్తగా రకరకాల రంగుల పక్షుల కిలకిలారావాలతో , పల్లె వాతావరణం ఉట్టిపడే శిల్పారామం సందర్శకులకు ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంది. ఉదయం 10 .30 నుండి సాయంత్రం 8 .00 గంటలవరకు సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది. సందర్శకుల కోసం చేనేత హస్త కళా ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంటాయి. సందర్శకులు మానసిక ఆనందాన్ని, ప్రకృతి ఒడిలో తీరేటట్టుగా అన్ని సదుపాయాలు కోవిద్ నిబంధనలను పాటిస్తూ సమకూర్చాము అని అధికారులు తెలిపారు.
