ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ జయప్రదం చేద్దాం

politics Telangana

వచ్చేనెల 8 నుండి 10 వరకు సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు

_ప్లీనరీ వాళ్లు పోస్టర్ ఆవిష్కరణలో రాష్ట్ర ప్లీనం ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

వచ్చేనెల 8 నుండి సంగారెడ్డిలో జరిగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్లీనం ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని శ్రామిక్ భవన్ లో జరిగిన సమావేశంలో చుక్కా రాములు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్లీనరీ గౌరవ అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతు విద్యరంగ,విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ అనునిత్యం పోరాడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై అనునిత్యం విద్యార్థుల పక్షాన నిలబడే సంఘం ఎస్ఎఫ్ఐ. సంఘం ప్లీనరీ సమావేశలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని.ఈ సమావేశంలో గత కార్యక్రమాలు, విద్యా రంగంలో పాలకులు తీసుకు వస్తున్న విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశాలకు జాతీయ అధ్యక్ష కార్యదర్శులు మయూక్ బిస్వాస్, విపి సాను ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు చెప్పారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఎస్ఎఫ్ఐ చేస్తున్న కృషికి తోడుగా విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చేనెల 8 న విద్యార్థుల భారీ ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందని, 9,10 తేదీ లో జరిగే సమావేశాల జయప్రదం కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారని. పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకులాలకు సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, పెండింగ్ లో ఉన్న మేస్, కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలని అన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ప్లీనరీ సమావేశలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, రాష్ట్ర ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షుడు మాణిక్యం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎర్రోళ్ల మహేష్, నల్లబెల్లి రమేష్ సహాయ కార్యదర్శి రజినీకంత్, రవి, సాయి, రజినీకాంత్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *