శేరిలింగంపల్లి :
గత 8 సం” ఎమెరిసిబి రెస్టౌరెంట్ ను నడిపిస్తూ కస్టమర్లకు రుచికరమైన మరియు పౌష్టికాహారాన్ని దాదాపు 200 రకాల వెరైటీలను ప్రజలకు అందిస్తున్నందుకు మరియు కరోనా కష్టకాలంలో ఉచితంగా ఆహార పొట్లాలు ఇతర సేవా కార్యక్రమాలు అనాధాలకు పండ్ల పంపిణీ,తన సొంత గ్రామంలో హరితహారం,యువకులకు అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు చందానగర్ లో గల MRCB నాన్ వెజ్ సూపర్ మార్కెట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ తక్కలపల్లి సత్యనారాయణ రావు గారికి తేదీ గురువారం రోజున హబ్సిగూడలో గల న్యూ ఆర్కిడ్ హోటల్ లో మహాత్మా గాంధీ ఆకాష్ ఇంటర్నేషనల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఎంపీ టీఆరెఎస్ పోలిట్ మెంబెర్ శ్రీ డాక్టర్ వేణుగోపాల చారి గారి చేతుల మీదుగా సేవ భూషణ్ అవార్డును డాక్టర్ తక్కలపల్లి సత్యనారాయణ రావు గారు అందుకున్నారు.
ఈ సందర్బంగా సత్యనారాయణ రావు గారు మాట్లాడుతూ ఈ అవార్డ్ తీసుకునందుకు చాలా సంతోషంగా ఉందని అవార్డ్ అందించిన మహాత్మా గాంధీ ఆకాష్ ఇంటర్నేషనల్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ కరోన సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ మస్కులు సానిటీజర్లు ఉపయోగిస్తూ పౌష్టికాహారాన్ని తింటూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో త్యాగరాయ గాన సభ అధ్యక్షులు జనార్ధన మూర్తి గారు,వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.