పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గణేష్‌గడ్డ దేవాలయం కోరికలు తీర్చే శక్తివంతమైన దేవాలయమని తెలిసి సంకష్టహర చతుర్థి సందర్భంగా సిద్ధి గణపతిని దర్శించుకున్నానని అన్నారు. ఆలయ అర్చకులు సీరియల్ నటుడు పవన్ సాయి కి పూజలు నిర్వహించి ,శాలువాతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ సంకష్టహర చతుర్థి ఈ దేవాలయాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని ,ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నేరవేరుతాయని ,గణనాధుని పూజిస్తే అన్ని విజయాలు కలుగుతాయని తెలిపారు . గతంలో ముద్దమందారం, మొగలిరేకులు, నాగ భైరవ వంటి ప్రముఖ సీరియల్స్‌లో నటించారు. ప్రస్తుతం ఘరానా మొగుడు అనే సీరియల్‌లో నటిస్తునాన్ని తెలిపారు .