Telangana

గిరిజన విద్యార్థులకు సెన్స్పె అవగాహన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ ప్రాంతంలోని గిరిజన/గ్రామీణ పాఠశాల విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానం (సెన్స్)పై అవగాహన ఏర్పరచి, కార్యాచరణ ఆధారిత అభ్యాసం ద్వారా శాస్త్రం పట్ల వారి వెఖరిని మార్చే లక్ష్యంతో వెళ్తానిక ప్రదర్శన, క్విజ్ పోటీలను హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించనున్నది. క్రిస్టలోగ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియా సౌజన్యంతో, విద్యార్థులకు చేరువయ్యే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, పడమట నరసాపురంలో ఈనెల 10వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.కార్యాచరణ ఆధారిత అభ్యాసం (యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్) ద్వారా సెన్స్ పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించి, వారి నెఖరిలో పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేయబోతున్నామన్నారు.. జూలూరుపాడు మండలం, ఆ చుట్టుపక్కల గిరిజన విద్యార్థులకు సమీకరించి, ప్రముఖ పరిశోధకులు, ఆచార్యులతో సెన్స్ ప్రాముఖ్యతను వివరించడం, సెన్స్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం, క్విజ్ పోటీలు, నమూనాల ప్రదర్శన వంటివి నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆయా పోటీల విజేతలకు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వెర్డే శాసనసభ్యుడు లావుడ్యా రాములు నాయక్, హైదరాబాద్ లోని ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ జీవన్లాల్ లావుడ్యాలు పాల్గొంటారని ప్రిన్సిపాల్ వివరించారు.ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను ఉచితంగానే నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ ఎగ్జిబిషన్లో రసాయన, భౌతిక, గణిత శాస్త్ర నమూనాలను మాత్రమే ప్రదర్శించడానికి అవకాశం కల్పించనున్నట్టు స్పష్టీకరించారు. మరిన్ని వివరాల కోసం కార్యక్రమ సమన్వయకర్తలు ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల 70136 02236 / డాక్టర్ కటారి 91777 1200 / డాక్టర్ ఆర్.బాలాజీరావు 97048 64966 లను సంప్రదించాలని, లేదా sciencexport@ailam.esu కు ఈ-మెయిల్ చేయాలని ఆయన సూచించారు

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago